ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతు న్న సినిమా గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర లలో నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రలలో నయనతార, సత్యదేవ్ లు నటి స్తున్నారు. ఆ విధంగా గాడ్ ఫాదర్ సినిమా ఒక్క మెగా క్రేజ్ తోనే కాకుండా మరెన్నో క్రేజీ అంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్వరలోనే ఈ సినిమా ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి.

నేడు ఈ సినిమా యొక్కఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయంత్రం యూ నిట్ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించబోతుంది. మరి ఇది సినిమా పై మరిన్ని అంచనాలను పెంచుతుందో చూడాలి. ఈ సినిమా కి థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఆచార్య మూవీతో చేదు అనుభవాన్ని చవిచూసిన చిరంజీవి ఇప్పుడు చేస్తున్న ఈ గాడ్ ఫాదర్ తో సినిమా తో మంచి కం బ్యాక్ చేయాలనీ భావిస్తున్నాడు. మెగా అభిమానులు సైతం ఇదే కోరుకుంటున్నారు.

ఇంకొకవైపు చిరంజీవి హీరోగా  భోళా శంకర్ సినిమా కూడా తెరకెక్కుతుంది. మెహర్ రమే ష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్ వేదాళం సినిమా కు రీమేక్ గా తెరకెక్కింది. ఇకపోతే  మెగా 154 సినిమా కూడా తెరకెక్కుతుంది. బాబీ దర్శకత్వంలో ఈ సిని మా తెరకెక్కుతుండగా దీనికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మరి ఈ సినిమా లను కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కల్లా విడుదల చేయాలనీ భావిస్తున్న నేపథ్యం లో ఆయా సినిమాలు ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరిస్తాయి చూడాలి. మెగా అభిమానులు అయితే ఈ బాస్ సినిమా కిశోరం ఎంతో ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: