యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మరి కొద్ది రోజుల్లో ఒక సినిమా ప్రారంభం కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా తెరకెక్కుతూ ఉండడంతో ఈ సినిమా అధికారిక ప్రకటనను ఎన్టీఆర్ 30 గా చిత్రబృందం ప్రకటించింది.

ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించడానికి  చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేయనుండగా, అనిరుద్ మ్యూజిక్ ను అందించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిత్ర బృందం ఇది వరకే చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేది ఎవరు అనేది మాత్రం చిత్ర బృందం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. గతంలో ఎన్టీఆర్ 30 వ సినిమాలో హీరోయిన్ గా ఫలానా హీరోయిన్ నటించబోతుంది అంటూ అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కాకపోతే ఇప్పటి వరకు చిత్ర బృందం మాత్రం ఏ హీరోయిన్ పేరు ను అధికారికంగా ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందేఎం ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది.

సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. దానితో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే సినిమాలో కూడా సమంత నే హీరోయిన్ గా తీసుకుబోతున్నారు అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్తలన్నీ అవాస్తవమని తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: