
ఆహా ఓటీటి లో ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఇక ఈ సినిమా చూసిన ఎంతో మంది ప్రముఖులు సైతం ప్రశంసలు అందించారు. ఇక చిరంజీవి అల్లు అర్జున్ సైతం సుహానటాలను మెచ్చుకున్నారని చెప్పవచ్చు. ఇదే క్రమంలో ఫ్యామిలీ డ్రామా చిత్రంలో విలక్షణమైన నటనతో బాగా మెప్పించారు. ప్రస్తుతం అంబాజీపేట, మ్యారేజ్ బ్యాండ్, రైటర్ పద్మభూషణ్ తదితర సినిమాలలో నటిస్తున్నారు. ఈ సినిమాలన్నీ హీరోగానే నటిస్తున్నాడు సుహాన్. అయితే ఈ నటుడు ఇక మీదట హీరోగా మాత్రమే చేయాలనుకుంటున్నాడట అందుకనే తన వద్దకు వచ్చిన ఏ చిత్రాన్ని కూడా రిజెక్ట్ చేయకుండా ఒప్పుకుంటున్నట్లు మీడియాలో పలు కథలుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక హీరోగా మారిన ఎందరో కమెడియన్స్ సైతం ఒకవైపు సినిమాలలో హీరోగా నటించిన కామెడీలతో బాగా ఆకట్టుకుంటూ ఉన్నారు. అలా కాకుండా హీరోగా మాత్రమే చేస్తానంటే చాలామంది నటులకు అవకాశాలకు తగ్గిపోయాయని చెప్పవచ్చు. దీంతో చివరికి మళ్ళీ కామెడీ వేషాలు వేస్తున్నారు. అయితే నటుడు సుహాన్ మాత్రం ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా కేవలం హీరోగా మాత్రమే చేయాలని భావిస్తున్నారు కాకపోతే.. తను నటించే చిత్రాలు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి వాటిని ఒటీటి లో నే విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఓటీటి లోనే హీరో పాత్రలు చేయాలనుకుంటున్నారు సుహాన్. మరి సక్సెస్ అవుతారేమో చూడాలి.