మంచి టాలెంట్ ఉన్న నటీమణులలో ఒకరు అయిన సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సమంత ఎన్నో రకాల పాత్రల్లో నటించి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఏం మాయ చేసావే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి ప్రస్తుతం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది.

సమంత కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ స్టార్ హీరోలతో కూడా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సమంత ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో లేడీ ఓరియంటెడ్ మూవీ లలో కూడా నటించి ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఇది ఇలా ఉంటే సమంత ప్రస్తుతం శాకుంతలం మరియు యశోద సినిమాల్లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా అతి త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాలతో పాటు ప్రస్తుతం సమంత , విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. 

ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమాలో సమంత పాత్రకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో సమంతా ఒక వినూత్నమైన పాత్రలో నటిస్తోంది అని, ఈ పాత్ర ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది అని, మరీ ముఖ్యంగా సమంత పాత్ర ద్వారా ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ రివిల్ కాబోతుంది అని, ఆ ట్విస్ట్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: