అందాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ 'భీమ్లా నాయక్' మూవీ లో దగ్గుపాటి రానా కు జోడిగా నటించిన విషయం  మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మల్టీస్టారర్ సినిమా కావడం , పవన్ కళ్యాణ్ ,  దగ్గుబాటి రానా లాంటి ఇద్దరు ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలు ఈ మూవీ లో నటించడం వల్ల సంయుక్త మీనన్ కి 'భీమ్లా నాయక్' సినిమా వల్ల పెద్దగా క్రేజ్ దక్కలేదు. కాకపోతే ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో భీమ్లా నాయక్ సినిమా విడుదల కాగానే ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సార్ అనే సినిమాలో సంయుక్త మీనన్ కి అవకాశం దక్కింది.

సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు టీజర్ ని మూవీ యూనిట్ విడుదల చేయగా , ఈ రెండింటికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతోంది. ఈ మూవీ మంచి విజయం సాధించినట్లయితే తెలుగు తో పాటు తమిళంలో కూడా సంయుక్త మీనన్ కి అదిరిపోయే క్రేజ్ లభిస్తుంది. అలాగే సంయుక్త మీనన్ ,  కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార మూవీ లో కూడా హీరోయిన్ గా నటించింది. భీమ్లా నాయక్ సినిమా విడుదల కాక ముందే ఈ ముద్దుగుమ్మకు ఈ మూవీ అవకాశం వచ్చింది. ఈ సినిమా ఆగస్ట్ 5 వ తేదీన విడుదల కాబోతుంది.

ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై సినీ ప్రముఖులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. బింబిసార మూవీ కనక మంచి సక్సెస్ ను సాధించినట్లు అయితే సంయుక్త మీనన్ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఇలా ఇలా వరుస సినిమాలతో ప్రస్తుతం సంయుక్త మీనన్ ఫుల్ స్పీడ్ ను చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: