రామ్ హీరోగా రూపొందిన వారియర్ చిత్రం ఇటీవల ప్రేక్షకులు ముందుకు రాగా అది బాక్సాఫీస్ వద్ద చతికిలపడి పోయింది. ఎన్నో అంచనాల మధ్య చేసిన ఈ స్టైలిష్ మాస్ యాక్షన్ చిత్రం ఏ మాత్రం కూడా ప్రేక్షకులను అలరించకపోవడం నిజంగా రామ్ అభిమానులను నిరాశపరిచింది. భారీ మాస్ చిత్రాల దర్శకుడైన లింగు స్వామి తరికెక్కించడంతో ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని అందరూ భావించారు కానీ కథ లేకపోవడం స్క్రీన్ ప్లే విషయంలో ఎటువంటి పట్టు లేకపోవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది.

ఫలితంగా రామ్ కు మరొక ఫ్లాప్ వచ్చి చేరినట్లు అయింది. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసే సినిమా పై న పూర్తి దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. భారీ మాస్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచిన బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని కూడా తన గత చిత్రాల తరహాలోనే చేయాలని భావించాడు. అందుకే ఒక అద్భుతమైన కథను రెడీ చేయగా త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లబోతున్నాడు. అక్కడ చిత్రం తర్వాత చేస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకులలో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు.

మరి మునుపెన్నడూ కనిపించనీ విధంగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూర్తి గా తన సినిమాలు చేసే విధానాన్ని మార్చి వేసిన రామ్ ఈ చిత్రాన్ని అదే తరహాలో చేయబోతున్నాడు ఎలివేషన్స్ విషయాన్ని పక్కన పెట్టి కథ విషయంలో పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్న రామ్సినిమా ద్వారా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. బోయపాటి శ్రీను కూడా ఒక అద్భుతమైన కథను ఈ సినిమా కోసం రెడీ చేశాడని అంటున్నారు. ఈ సినిమా ను కూడా వారియర్ ను నిర్మించిన నిర్మాణ సంస్థ చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: