బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . షారుక్ ఖాన్ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించకపోయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా షారుక్ ఖాన్ తన కంటూ ఒక మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల పాటు మూవీ లకు దూరంగా ఉన్న షారుక్ ఖాన్ ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా షారుక్ ఖాన్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ లో స్టార్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్న అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం షారుక్ ఖాన్ కు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా, ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ మూవీ లో తమిళ స్టార్ నటులలో ఒకరు అయిన విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

జవాన్ మూవీ లో విలన్ పాత్ర కు విజయ్ సేతుపతి అయితే చాలా బాగుంటుంది అని దర్శకుడు అట్లీ , షారుఖ్ ఖాన్ కి చెప్పడంతో షారుక్ ఖాన్ వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తోంది. అలాగే మూవీ యూనిట్ విజయ్ సేతుపతి ని సంప్రదించగా విజయ్ సేతుపతి కూడా ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే విజయ్ సేతుపతిమూవీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: