సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఇక ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ తో ఆయన రెడీ అవుతున్నారు. వీటిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఒక సినిమా చేస్తున్నాడు.దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఈ కాంబినేషన్ లో మరోసారి ఈ సినిమా రాబోతుంది. దాంతో ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్  అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తోపాటు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం తెలుస్తోంది.ఇంకా ఇదిలా ఉంటే ఇప్పుడు మరో దర్శకుడికి కూడా మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చూస్తున్నారట. ఇక ఇంతకు ఆదర్శకుడు ఎవరంటే..


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాల్లో ఫ్యాన్స్ కి బాగా నచ్చిన సూపర్ స్టైలిష్ మూవీ అంటే వెంటనే చెప్పే పేరు అతిథి. సీనియర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అతిథి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సినిమాలో మహేష్ లుక్ ఇంకా యాక్షన్ కు ఫ్యాన్స్ అంతా ఫిదా అయ్యారు.సురేందర్ రెడ్డి అంటేనే స్టైలిష్ సినిమాలకు పెట్టింది పేరు.ఇప్పుడు మరోసారి మహేష్ బాబు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఓ పవర్ ఫుల్ కథను మహేష్ బాబుకు వినిపించారట సురేందర్ రెడ్డి. మహేష్ కు కూడా ఆ కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అయితే ఇక రాజమౌళి సినిమా పూర్తయ్యే సరికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ లోగా సురేందర్ రెడ్డి సినిమాను కంప్లీట్ చేయాలని కూడా అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత వున్నదో అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: