నందమూరి నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. ఇక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రజెంట్ నందమూరి ఫ్యామిలీ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది నటసింహం బాలకృష్ణ అయితే..ఆ తర్వాత అందరికి గుర్తు వచ్చేది జూనియర్ ఎన్టీఆర్ పేరే.కేవలం రూపంలో నే కాదు ఇంకా నటనలో కూడా జూనియర్ ఎన్టీఆర్..తాతకు తగ్గ మనవడని నిరూపించుకున్నాడు.తాజాగా ఆర్ ఆర్ ఆర్‌ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.తెలుగు చిత్ర పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్‌ పై అసలు ఇప్పటివరకు ఎలాంటి రోమర్లు కూడా లేవు. తన పని ఏంటో తాను చేసుకు పోతుంటాడు తారక్.సినిమా లైఫ్ ను ఇంకా పరసనల్ లైఫ్ ను సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు తారక్. కెరియర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలోనే తారక్ పెళ్లి చేసుకున్నాడు.తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడుకి ఎన్టీఆర్ మామగారు వరసకు మేనల్లుడు అవుతారు. అలా ఇక ఎన్టీఆర్ తన బంధువులలో ఒకరైన లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకున్నాడు.వీరిద్దరి పెళ్లి చాలా అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మి ప్రణతి అంటే కుందనపు బొమ్మ..తన కట్టు బొట్టుతో ఎన్టీఆర్ గౌరవాన్ని ఇంకా పెంచుతుంది. ఇక తారక్ ప్రణతి దంపతులకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.వారి పేర్లే అభయ్ రామ్, భార్గవ్ రామ్.


జూనియర్ ఎన్టీఆర్ ది పెద్దలు కుదుర్చున పెళ్లి అయినప్పటికీ బంధువుల అమ్మాయి అవ్వడంతో వీరి ఇరువురు పెళ్లికి ముందు తరచూ ఫోన్లో ఎక్కువగా మాట్లాడుకునే వారట.ఇక ఆ సందర్భంలో ఎన్టీఆర్‌కు లక్ష్మీ ప్రణతి కొన్ని కండిషన్లు కూడా పెట్టిందట. పెళ్లి అయిన తర్వాత సినిమాలతో బిజీగా ఉన్నా సరే కొంచెం టైం అయినా ఫ్యామిలీ కోసం కేటాయించాలని ప్రణతి చెప్పిందట. తన పెళ్లి అవ్వకముందు ఎన్టీఆర్ ఎక్కువగా ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లేవారట. అయితే, పెళ్లి తరవాత మీరు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం తగ్గించాలని కూడా ఆమె చెప్పిందట. ఎన్టీఆర్ తన సినిమా షూటింగుల్లో అవుట్ డోర్ వెళ్లేటప్పుడు వేసుకునే డ్రెస్సెస్ ని కూడా తానే తీసుకుంటానని ఆమె ముందే చెప్పిందట. ఇక అంతేకాదు, తారక్ ఫుడ్ విషయం లో కూడా లక్ష్మి ప్రణతి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందట. ఇలా ముందుగానే లక్ష్మీ ప్రత్తి తారక్ కి కొన్ని కండిషన్స్ అనేవి పెట్టిందట. ఆ కండిషన్లు విని తారక్ చాలా నవ్వుకున్నారట. ఫైనల్లీ పెళ్లి చేసుకుని ఇక ఇప్పుడు ఇద్దరు బిడ్డలతో చాలా హ్యాపీగా ఉన్నారు ఈ దంపతులు. వీరు ఇరువురు ఇప్పుడు చాలామంది జంటలకు కూడా ఎంతో ఆదర్శంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: