జబర్దస్త్ లో కమెడియన్స్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే కొత్తగా వచ్చిన వారి దగ్గర్నుంచి కొన్నేళ్ల నుంచి జబర్దస్త్ లో కొనసాగుతున్న స్టార్ కమెడియన్స్ వరకు కూడా అందరూ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులు అని చెప్పాలి. అయితే ఇక జబర్దస్త్ లో ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్వించే కామెడీ మాత్రమే కాదు లవ్ ట్రాక్ లు కూడా ఎక్కువగానే నడుస్తూ ఉంటాయి. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రష్మి సుడిగాలి సుధీర్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులు కన్ఫ్యూషన్ లోనే ఉన్నారు.


 వీరిద్దరూ ప్రేమలో లేరు అన్న విషయాన్ని ఎంతో మంది మిగతా కమెడియన్స్ చెప్పినప్పటికీ కూడా వీరు ప్రేమలో లేరు అన్న విషయం నమ్మడం లేదు. అయితే రష్మీ సుధీర్ జంట ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది లేదో జబర్దస్త్ వర్ష ఇమాన్యుయల్ జంట కూడా లవ్ట్రాక్ తో ఫేమస్ అయింది. జబర్దస్త్ బ్లాక్ అండ్ వైట్ జోడి గా గుర్తింపు సంపాదించింది. ఇక వీరిద్దరూ ఒకరి కోసం ఒకరు స్టేజి మీద చెప్పుకునే డైలాగులు ప్రతి ఒక్కరిని కన్ఫ్యూజన్లో పడేస్తూ ఉంటాయ్.


 ఇక ఇటీవలే  మరో సారి వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని తమ మాటల రూపంలో చెప్పుకున్నారు. ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్  ప్రోమో లో భాగంగా మీ ఇద్దరు  మీ ప్రేమను నిరూపించుకుంటే మిమ్మల్ని నరకం నుంచి స్వర్గానికి పంపిస్తా అంటూ చెబుతారు ఆటో రాంప్రసాద్. ఈ క్రమంలోనే వర్ష మాట్లాడుతూ ఇమ్ము అందరికీ ఒక డౌటు ఉంది. ఏంటి వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అని.. అందరికీ చెప్పాల్సింది ఏంటంటే.. ఏరోజు ఇమ్ము వద్దంటాడో ఆరోజు  వర్ష ఊపిరి ఉండదు అంటూ ఎమోషనల్ గా చెబుతుంది. దీంతో పట్టలేని ఆనందం తో ఊగిపోతాడు ఇమ్మానియేల్. అంతలోనే ఒకే ఒక లోకం నువ్వు అంటూ పాట వస్తుంది. అయితే యముడిగా చేసిన గెటప్ శ్రీను ఆపండి అంటూ పాట వేసిన వారికి కౌంటర్ వేస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: