ఉప్పెన చిత్రంతో మొదటిసారి వెండితెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక మొదటి చిత్రం విడుదల కాకముందే రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఉప్పెన షూటింగ్ సమయంలో కొంతమంది నిర్మాతలు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట అలా తన పాపులారిటీ మరింత పెంచుకుంది కృతి శెట్టి. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలలో శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు వంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.


ఇక ఇలా వరుసగా లవ్ కమర్షియల్ సినిమాలతో మంచి సక్సెస్ కావడమే కాకుండా ఈ ముద్దుగుమ్మకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేశాయి. ఇక దీంతో ఈమె రెమ్యూనరేషన్ కోటికి పైగా డిమాండ్ చేసినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఇక తాజాగా హీరో రామ్ పోతినేని తెలుగు తమిళంలో నటించిన ది వారియర్ సినిమా సక్సెస్ అయితే తమిళంలో కూడా ఏమి బిజీ హీరోయిన్గా మారి ఉండేది కానీ ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు.. ఇక ఇటీవలే వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త నిరాశపరిచినట్లుగా తెలుస్తోంది తన పాత్రకు ప్రాధాన్యత లేకుండా నటించినట్లుగా సమాచారం


ఇక దీంతో మొదటి సినిమాలతో వచ్చిన క్రేజ్ ను ఇప్పుడు ఈ సినిమాలతో ఈమెకు అంత డిమాండ్లను పెంచేలా లేవన్నట్లుగా ఆమె అభిమానులు తెలియజేస్తున్నారు. ఈమె కథల ఎంపికలు సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే రాబోయే రోజులలో సినీ అవకాశాలు రావడం చాలా కష్టమే అన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కేవలం కొన్ని సినిమాలలో ఈమె పాటలకు మాత్రమే పరిమితమైంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ హీరోయిన్ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఇక అంతే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి కృతి శెట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: