మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా అభిమానులకు ఒక పండుగరోజు. చిరంజీవి వయసు 67 సంవత్సరాలు దాటిపోతున్నా ఇప్పటికీ చాల యాక్టివ్ గా ఉంటూ వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. అలాంటి చిరంజీవి రామ్ చరణ్ లు కలిసి నటించిన ‘ఆచార్య’ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడం మెగా అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.


ఈమూవీ విడుదలైన మొదటిరోజు మొదటి షో నుండి కలక్షన్స్ లేకపోవడం మెగా అభిమానులకు ఒక పీడకల లా మారింది. ఇలాంటి పరిస్థితుల మధ్య లేటెస్ట్ గా విడుదలైన ‘బింబిసార’ ఘన విజయంతో నందమూరి అభిమానులు రెచ్చిపోతు ‘మెగాస్టార్ కళ్యాణ్ రామ్’ అంటూ సోషల్ మీడియాలో చేసిన హంగామా మెగా అభిమానులకు అసహనం కలిగించినట్లు టాక్.


దీనితో ఆగష్టు 22 చిరంజీవి పుట్టినరోజున సోషల్ మీడియాలో ఘనంగా చేయాలని మెగా ఫ్యాన్స్ కు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు అన్నీ సమాయుక్తం అవుతూ మెగా స్టార్ కీర్తిని మరొకసారి అందరికీ తెలిసేలా హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి తెగ సందడి చేయబోతున్నారు. ఇది చాలదు అన్నట్లుగా చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ మూవీ ట్రైలర్ ఆరోజు విడుదల కాబోతోంది. దీనితో ఆమూవీ ట్రైలర్ ను ట్రెండింగ్ గా మార్చాలని మెగా అభిమానులు ఇప్పటి నుండే మాష్టర్ ప్లాన్ వేస్తున్నారు.


ఇది చాలదు అన్నట్లుగా చిరంజీవి నటిస్తున్న ఇతర మూవీలు ‘భోళాశంకర్’ ‘వాల్టేర్ వీరయ్య’ సినిమాల ప్రచార హంగామా కూడ ఆరోజు జరగబోతోంది. ఎప్పటిలాగే ఆరోజు తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి అభిమానులు మెగా రక్తదాన శిబిరాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడ భారీగా చేయబోతున్నారు. ఈ పరిస్థితులు ఇలా ఉండగా చిరంజీవిని తిరిగి రాజకీయాలలోకి తీసుకు రావాలని భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు ఎంతవరకు చిరంజీవి నుండి స్పందన వస్తుంది అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే చిరంజీవి మాత్రం మరొకసారి రాజకీయాల ఊబిలోకి వెళ్ళి మళ్ళీ పరాజయాలు కోరి కొనితెచ్చుకునే ఆలోచనలలో లేడు అన్నమాటలు వస్తున్నాయి..మరింత సమాచారం తెలుసుకోండి: