హైపర్ ఆది.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా ఈ జబర్దస్త్ కమెడియన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎప్పటిలాగే సాదాసీదాగా సాగిపోతున్న జబర్దస్త్ కార్యక్రమంలో తన పంచులతో సునామీ సృష్టించింది. ఒక్కసారిగా సరికొత్త ట్రెండ్ కు నాంది పలికాడు హైపర్ ఆది. ఈ క్రమంలోనే బుల్లితెర ప్రేక్షకుల చూపులు ఆకర్షించి టీం లీడర్ గా ఎదిగాడు. ఇక ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్న ప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు ఢీ షో లో కూడా టీం లీడర్ గా వ్యవహరిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే హైపర్ ఆది అమ్మాయిలపై కామెంట్ చేయడం తరచూ జరుగుతూనే ఉంటుంది.


 ఢీ షో లో భాగంగా కంటెస్టెంట్స్ దగ్గరి నుంచి అటు జడ్జెస్ వరకు అందరి పై కామెంట్ చేస్తూ ఉంటాడు. అంతే కాదు ప్రియమణి వస్తే నా మరదలు అనడం శ్రద్ధాదాస్ వస్తే ఒక హగ్గు ఇవ్వాలని కోరడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇలాంటి పంచుల తోనే  అటు ప్రేక్షకులను నవ్వించడం చేస్తూ ఉంటాడు హైపర్ ఆది. ఇకపోతే ఇటీవలే వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో విడుదలైంది. ఈ ప్రోమో లోని అన్ని పర్ఫామెన్స్ లు అదిరి పోయాయి అని చెప్పాలి. అయితే ఒకసారి ఈ ప్రోమో లోకి తొంగి చూస్తే హైపర్ ఆదికి జడ్జీగా ఉన్న శ్రద్దాదాస్ ఒక అదిరిపోయే ఆఫర్ ఇస్తుంది.


 తాను చెప్పిన పని చేస్తే ఒక ముద్దు పెడతాను అంటూ చెబుతోంది. శ్రద్ధాదాస్ ఇలాంటి ఆఫర్ ఇవ్వడంతో అక్కడున్న వారందరూ అవాక్కవుతారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే హైపర్ ఆది ఐస్  పై నిలబడి పాటలు పాడాలి అంటూ చెబుతోంది. అయితే శ్రద్దాదాస్ ముద్దు కోసం ఎంతో కష్టపడి ఐస్ పై నిలబడి పాటలు పాడుతూ ఉంటాడు హైపర్ ఆది. ఈ క్రమంలోనే పాటలను ఖూనీ చేస్తూ చిత్ర విచిత్రంగా పాడటం చేస్తూ ఉంటాడు. ఇది చూసిన బుల్లితెర ప్రేక్షకులు పాపం శ్రద్దాదాస్ ముద్దు కోసం ఎంత కష్ట పడుతున్నాడో అని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: