ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి. ఒకేసారి నాలుగైదు సినిమాలను చేస్తూ ఎవరికి సాధ్యం కాని విధంగా ఆయన తన సినిమాలను చేస్తూ ఉండడం విశేషం. వీటిలో ముందుగా బాలీవుడ్ లో రూపొందించిన ఆది పురుష్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే విధంగా ఇప్పటికే అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర బృందం. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ఆ తర్వాత సలార్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా జరుపుకుంటుంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాకు అది ఎక్కువ సమయాన్ని తీసుకోవడంతో ఈ చిత్రాన్ని ఇప్పుడు చేయడానికి ఆయన రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రాజెక్ట్ కే కూడా ఇదే సమయంలో చేస్తున్నాడు హీరో ప్రభాస్. ఐతే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని అంటున్నారు.

త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. ప్రభాస్ చేసిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా వస్తున్నాయి. అవి ఎంతటి విజయాన్ని అందుకున్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ విధంగా ఇప్పుడు ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. చాలా రోజులుగా ఈ సినిమా యొక్క షూటింగ్ జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో భారీ కాన్వాస్ తో ఈ చిత్రం రూపొందుతుండగా సైన్స్ ఫిక్షన్ సినిమాగా పాన్ వరల్డ్ చిత్రంగా ఇది రాబోతుంది అని అంటున్నారు. ఈ చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక సందీప్ వంగా దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: