కొంతమంది హీరోలకు ఏ విధమైన బ్యాడ్ లక్ ఉంటుంది అంటే వారు ఎలాంటి స్టెప్పు ముందుకు వేసినా కూడా వారికి అది చెడు ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది. ఆ విధంగా అక్కినేని
అఖిల్ సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఆయనకు బ్యాడ్ లక్ ఎదురవుతూనే ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఆయన నటించిన తొలి మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను ఏమాత్రం అలరించ లేకపోయాయి.
ఎన్నో అంచనాల మధ్య చేసిన ఈ మూడు సినిమాలు కూడా అక్కినేని అభిమానులను సైతం మెప్పించక పోవడం ఆయనకు ఎంతో అవమానకరమైన సంఘటన అని చెప్పాలి. ఈ నేపథ్యంలో నాలుగవ
సినిమా మోస్తరు విజయం సాధించడం
అఖిల్ కు ఊరటను కలిగించింది. కానీ అక్కినేని అభిమానుల ఆకలి తీరాలంటే భారీ స్థాయిలో విజయాలు ఫలితాలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అవన్నీ దృష్టిలో ఉంచుకొని
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన ఏజెంట్ అనే ఒక యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను మొదలు పెట్టాడు.
అయితే ఈ సినిమాకు ఆర్థిక సమస్యలు రావడం అసలు ఈ
సినిమా రూపొందుతుందా లేదా అన్న అనుమానాలను కలిగించింది. చివరకు ఈ
సినిమా ఆర్థిక సమస్యల నుంచి బయటపడి ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది. వాస్తవానికి ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయవలసి ఉండగా ఇప్పుడు అది
డిసెంబర్ కు వెళ్ళింది.
సినిమా యొక్క షూటింగ్ మొత్తం పూర్తి కాకపోవడంతోనే ఈ
సినిమా నో డిసెంబర్లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు అయితే అప్పటికి కూడా ఈ
సినిమా షూటింగ్ పూర్తవుతుంది అన్న గ్యారెంటీ లేకపోవడంతో ఈ చిత్రాన్ని వేసవికి విడుదల చేయాలని ఆప్షన్ ను చిత్ర బంధం పెట్టుకుంటుంది. మరి అక్కినేని
అఖిల్ ఈ సినిమాను విడుదల చేసి హిట్టు కొట్టాలనే కోరిక మరికొన్ని రోజులు వాయిదా పడుతుందని చెప్పాలి.