సూపర్ స్టార్ మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్క బోయే మూవీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ కి సంబంధించిన లుక్ షూట్ నిన్న జరిగినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో రెండు మూవీ లు తెర కెక్కాయి.

దాదాపు 11 సంవత్సరాల తర్వాత వీరిద్దరు కాంబినేషన్ లో తెరకెక్కుబోతున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమా పై మహేష్ బాబు అభిమాను లతో పాటు , మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టు కున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఐ వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా  తెరకెక్కించ బోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో అదిరి పోయే యాక్షన్ సీన్స్ ఉండనున్నట్లు సమాచారం. ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ , మహేష్ బాబు తో అదిరి పోయే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు సమాచారం.  

ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించినుండగా ,  తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ లో 28 వ మూవీ గా తెరకెక్కబోతుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇది వరకే మహేష్ బాబు పూజ హెగ్డే కాంబినేషన్ లో మహర్షి మూవీ తెరకెక్కింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: