విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ఖుషి. డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోతుందని గతంలో చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రములో సమంత కథానాయకగా నటిస్తూ ఉండగా ఈ సినిమా యొక్క తాజా స్కెడ్యూల్ ఇంకా మొదలు కాకపోవడం ఒక సారిగా అందరిలో ఎంతో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అభిమానులలో ఈ సినిమా యొక్క విడుదల తేదీ పై క్లారిటీ లేకపోవడం జరిగింది.

గత కొన్ని రోజులుగా సమంత షూటింగ్ లో పాల్గొనడం లేదని అందుకే ఈ సినిమా యొక్క విడుదల ఆలస్యం అవుతుందని ప్రచారం జరుగుతుంది. ఆమె ఒక వింత వ్యాధితో బాధపడుతుందని ఆ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిందని ఆమె రావడానికి అక్టోబర్ నెల పడుతుందని అప్పటిదాకా ఈ సినిమా ముందుకు వెళ్లడానికి లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే నిజమైతే కనుక సమయంలో ఈ సినిమాను విడుదల చేయడం అసాధ్యం అనే చెప్పాలి. దీనిపై చిత్ర బృందం ఒక క్లారిటీ ఇస్తే ఎలాంటి అయోమయం లేకుండా ఉంటుంది అనేది విజయ్ దేవరకొండ అభిమానులు చెబుతున్న మాట.

ఇకపోతే ప్రేమకథ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసి అందరిలో ఆసక్తిని పెంచారు. లైగర్ సినిమా తర్వాత అంతటి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. ఈ సినిమా తర్వాత ఆయన ఓ భారీ దర్శకుడు తో సినిమా చేసే విధంగా రంగం సిద్ధం చేస్తున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. మరి విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాలు బాగా ఉండాలని అయన అభిమానులు కోరుకుంటున్నట్లు చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: