పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే పర్సనాలిటీ ఆయనది. అలాంటి డార్లింగ్ కు చెల్లెళ్ల అంటే ఎంతో ప్రాణం.
తాజాగా తన చెల్లి ప్రసీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇంత మచ్చ కూడాలేని హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. విమర్శలకు దూరంగా ఉండే డార్లింగ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రభాస్.. తన కుటుంబం తోనూ సమయం గడుపుతుంటారు. మరీ ముఖ్యంగా డార్లింగ్ కు తన చెల్లెళ్లు అంటే ఎంతో ప్రేమ.

దివంగత రెబల్ స్టార్ కృష్ణం రాజుఈ నెల 11న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, స్టార్ హీరోలు, సినీలోకం, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ఎదుగదలకు ప్రముఖ పాత్ర పోషించిన ఆయన మరణవార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ విషాద ఘటన నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్న ఆయన షూటింగ్ షెడ్యూల్స్ ను కూడా పోస్ట్ పోన్ చేశారు. కుటుంబ సభ్యులు, మరీ ముఖ్యంగా తన చెల్లెళ్లకు ధైర్యం చెబుతున్నారు. కృష్ణం రాజు మరణంతో ఇక ప్రభాసే చెల్లెళ్లకు అండగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలో కృష్ణం రాజు పెద్ద కూతురు, ప్రభాస్ పెద్ద చెల్లి ప్రసీదా ఉప్పలపాటి డార్లింగ్ గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. చెల్లెళ్ల పట్ల ప్రభాస్ ఎంత ప్రేమ చూపిస్తారోనని ఆమె చెప్పిన మాటలు అందరీ హృదయాలను కదిలిస్తోంది. ప్రస్తుతం ప్రసీద మాటలు వైరల్ గా మారాయి.

ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రసీద కేరీర్ పైనా ప్రభాస్ శ్రద్ధ వహించే వారంట. ఫిల్మ్ ప్రొడ్యూసర్ గా మారాలనే ప్రసీద ఆశయాన్ని కూడా చేర్చేందుకు తనవంతుగా సహకరించాడంట. అమెరికాలోని న్యూ యార్క్ ఫిల్మ్ అకాడెమిలో తను ప్రొడక్షన్ పై కోర్సు చేసేందుకు అన్ని రకాల హామీ ఇచ్చినట్టు ప్రసీద తెలిసింది. అలాగే ఆమె నిర్మించిన చిత్రాలపై ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించారని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా కృష్ణం రాజు ముగ్గురు కూతుళ్లు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తిలపై ప్రభాస్ కు ఎనలేని ప్రేమ చూపిస్తుంటాడంట. ఎంతటి బిజీ షెడ్యూల్ లోనైనా తమకోసం సమయం కేటాయిస్తాడని, సరదాగా ఉంటారని తెలిపింది. ఒక్కోసారి.. గంట సమయం కేటాయించిన ప్రభాస్.. రోజంతా చెల్లెళ్లతో ముచ్చటించేవారని చెప్పింది. దీంతో ప్రభాస్ తన చెల్లెళ్ల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో అర్థం అవుతోంది. మున్ముందు వారి పెళ్లి కూడా చేయాల్సిన బాధ్యత అన్నయ్య ప్రభాస్ పైనే ఉండటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: