బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ కూతురు ఐరా ఖాన్‌ తండ్రి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారే తో కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే.
వీరిద్దరు కలిసి పండగ లు, స్పెషల్‌ డేస్‌ను సెలబ్రెట్‌ చేసు కున్న ఫొటోలను తరచూ సోషల్‌ మీడియా వేదికగా పంచు కుంటుంది. అయితే దీనిపై ఎప్పుడూ ఐరా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తాజాగా తమ రిలేషన్‌ పై ఐరా అధి కారిక ప్రటకన ఇచ్చింది. ఈ సందర్భంగా తాను ఎస్‌ చెప్పా నంటూ ఐరా ఓ క్యూట్‌ వీడియో షేర్‌ చేసింది.
ఇందులో నుపుర్‌ ఐరా కు రింగ్‌ తొడు గుతూ ప్రపోజ్‌ చేసినట్లు కనిపించాడు. సైక్లింగ్‌ పోటీలో భాగంగా నుపుర్‌ ఇటీవల విదేశాలకు వెళ్లాడు. అతని కి తోడు గా ఐరా కూడా వెళ్లింది. ఇక పోటీలు ముగి సిన వెంట నే ప్రియురాలి వద్దకు వచ్చిన నుపుర్‌ ఆమెను హత్తుకుని ముద్దాడాడు. అనంతరం మోకాలి పై కూర్చొని ' నన్ను పెళ్లి చేసుకుంటావా' అని ఉంగరం తొడుగుతూ ప్రపోజ్‌ చేశాడు. ఇక వెంటనే ఐరా మురిసి పోతూ ప్రియుడి కి తన చేయి అందించింది. ఇక ఈ వీడియో ఆమె షేర్‌ చేస్తూ 'నేను ఎస్‌ చెప్పాను' అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది.
తన పోస్ట్‌పై పలువురు బాలీవుడ్‌ సినీ సెల్రబె టీలు స్పందిస్తూ ఈ లవ్‌ బర్డ్స్‌కి శుభాకాంక్షలు తెలుపు తున్నారు. ఇదంత చూస్తుంటే త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతుందని తెలుస్తోంది. కాగా కొన్నేళ్ల కు ఆమీర్‌కు నుపుర్‌ ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలోనే నుపుర్‌తో ఐరాకు పరి చయం ఏర్పడింది. తొలుత స్నేహితులు ఉన్న వీరిద్దరు ప్రేమలో పడ్డారు. 2020 నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉండగా.. తాజాగా తమ బంధాన్ని అధికారికం చేసుకున్నారు ఈ లవ్‌బర్డ్స్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: