తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ల లో ఇప్పుడు టాప్ లో ఎవరు ఉన్నారంటే థమన్ పేరునే చెబుతున్నారు. ఈయన ఈ మధ్య చేసే సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వడంతో అంతా కూడా ఈయన వెంటే పడుతున్నారట.


అయితే ఈయన కు ఇటీవల మళ్ళీ కాపీ క్యాట్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.. మరి ఈయన తాజాగా మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాకు కూడా సంగీతం అందించాడు.


మరి ఈ సినిమా విషయంలో అయితే మెగా ఫ్యాన్స్ ఏ విధంగానూ ఖుషీ అవ్వలేక పోతున్నారు. మ్యూజిక్ నుండి బీజీఎమ్ వరకు అన్ని విషయాల్లో థమన్ పై గుర్రుగా ఉన్నారు.. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గాడ్ ఫాదర్ టీజర్ తో అయితే బాగా అప్సెట్ చేసాడు.. ఈ టీజర్ లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని విన్న వెంటనే గని సినిమాలోది దింపేశారు అని కామెంట్స్ కూడా వినిపించాయి..


అయితే మెగాస్టార్ మాత్రం మెగా ఫ్యాన్స్ కు రివర్స్ లో కామెంట్స్ చేసారు.. ఈయన చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు చర్చ కు దారి తీశాయి.. తాజాగా ఇన్ ద క్లౌడ్స్ విత్ గాడ్ ఫాదర్ అనే పేరు తో శ్రీముఖి తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరు ప్రోమో ను తాజాగా రిలీజ్ చేసారు.. ఈ ప్రోమోలో థమన్ పై మెగాస్టార్ ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్స్ చేసారు.. తమన్ పై చిరు ఎంత నమ్మకంగా ఉన్నారో ఈయన మాటల్లోనే అర్ధం అవుతుంది.. మరి ఈయన నమ్మకం థమన్ నిలబెడతాడో లేదో చూడాలి.. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది. చూడాలి మెగాస్టార్ ఆచార్య ప్లాప్ ను మరిపిస్తాడో లేదో..ఆచార్య సినిమా ఎన్నో అంచనాలతో భారీ బడ్జెట్ తో విడుదలైంది. కానీ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు లేకపోవడంతో ప్లాప్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: