అనుష్క... సూపర్ సినిమాతో 2005లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి అలియాస్ స్వీటీ శెట్టి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆమె పూరి జగన్నాథ్ నాగార్జునల వల్లే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
గత ఇరవై ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న అనుష్క టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు ఏకచక్రాది పత్యం చేసింది. ప్రస్తుతం కాస్త వెనకబడ్డ అనుష్క స్థాయిలో ఇండస్ట్రీ లో ఎవరు రానించలేదని చెప్పాలి. కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే కంటెంట్ ఉన్న సినిమాల్లో కూడా నటించిన ఘనత ఆమెకే చెల్లుతుంది లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా అనుష్క పెట్టింది పేరు. రుద్రమదేవి అరుంధతి చత్రపతి వంటి చిత్రాల ద్వారా ఆమె స్థాయి పతాక శీర్షికన నిలిచింది.

అయితే ఆమె సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే సమయంలో ఒక గమ్మత్త జరిగిందనే విషయం బయట ప్రపంచానికి తెలియదు. జగన్నాథ్ ముంబైలో ఉన్న అనుష్కను ఆడిషన్ కోసం హైదరాబాద్ కి రప్పించాడట. ఇప్పటివరకు ఆడిషన్ అని ఒక ప్రాసెస్ ఉంటుందనే విషయం కూడా ఆమెకు తెలియదు దాంతో కాస్త కంగారు పడిందట అనుష్క. ఆడిషన్ జరుగుతున్న సమయంలో తనతో పాటు మరొక అమ్మాయి కూడా ఆరోజు ఆడిషన్ కి వచ్చిందట. అమ్మాయి మరెవరో కాదు అప్పటి మిస్ ఇండియా పర్మిట్ ఠాగూర్. ఆమెకి మోడల్ ఇన్ రంగంలో మేకప్ విషయంలో ఎంతో అవగాహన ఉండడంతో చక్కగా ఆడిషన్ పూర్తిచేసుకుని వెళ్లిపోయిందట కానీ అసలు ఎలాంటి మేకప్ ఐడియా లేకుండానే అలాగే ఫోటోలకు ఫోజులు ఇవ్వడం రాకుండానే ఆడిషన్ లో పాల్గొన్న అనుష్కనే పూరి జగన్నాథ్ సూపర్ సినిమాలో రెండవ లీడ్ క్యారెక్టర్ కోసం ఎంచుకున్నాడట..
మిస్ ఇండియా ని సైతం పక్కనపెట్టి అనుష్క ఎంచుకోవడంలో నాగార్జున హస్తం కూడా ఉంది ఆమెలో ఏదో ఒక కొత్త పొటెన్షియల్ కనిపిస్తుందని కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉందని నాగార్జున ఆరోజే లెక్క వేశాడట. దాంతో పూరి జగన్నాథ్ మిస్ ఇండియా అని పక్కనపెట్టి అనుష్క ని సెలెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఈరోజు 20 ఏళ్ల కాలచక్రం గిరిన తిరిగిన తర్వాత అనుష్క స్టార్ హీరోయిన్గా ఉంది దానికి కారణం కచ్చితంగా పూరి జగన్నాథ్ నాగార్జున అని అంటుంది అనుష్క…

మరింత సమాచారం తెలుసుకోండి: