దివంగత నటుడు శ్రీహరి హీరోగా మరియు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించారు. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఆయన ఆనారోగ్యానికి గురయ్యారు.


సినిమా షూటింగ్ కోసం ముంబైకి వెళ్లిన ఆయనకు సడెన్ గా సీరియస్ అవ్వడంతో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కానీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆయన మరణించారు. వ్యక్తిగతంగా శ్రీహరి గొప్ప వ్యక్తి. ఎందరికో సాయం చేశారాయన. రీసెంట్ గా శ్రీహరి భార్య శాంతి ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేసిందట..


తమకు రెమ్యునరేషన్స్ కరెక్ట్ గా వచ్చి ఉంటే మరో పది ఇళ్లు కొనేవాళ్లమని.. శ్రీహరి గారు చనిపోయిన తరువాత ఇప్పుడున్న ఇంటిపై అప్పులుంటే నగలన్నీ అమ్మేసి తీర్చేశానని చెప్పుకొచ్చింది. అలానే కార్లను కూడా అమ్మేసినట్లు చెప్పింది. చిరంజీవి గారి సంస్థ సహా మరో రెండు, మూడు సంస్థలు మాత్రమే శ్రీహరి గారికి రెమ్యునరేషన్ కరెక్ట్ గా ఇచ్చేవారని.. చాలా మంది డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఆమె చెప్పుకొచ్చింది.


 


అయితే శ్రీహరి గారికి సినిమాలంటే పిచ్చి అని.. అందుకే డబ్బులు ఇవ్వకపోయినా నటించేవారని తెలిపింది. శ్రీహరిగారు చనిపోయిన తరువాత ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోలేదని ఎమోషనల్ అయింది. మధ్యలో ఒకసారి బాలకృష్ణ గారు ఫోన్ చేశారని.. ఆయనకు అసలు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదని.. కానీ చేసి మాట్లాడారని తెలిపింది. బాలయ్య నటించిన సినిమాలో శ్రీహరి గారు ఒక క్యారెక్టర్ చేశారట. దానికోసం ఆయన ఫోన్ చేసి..


 


'శాంతి గారు శ్రీహరిగారు మా సినిమాలో ఒక క్యారెక్టర్ చేశారు. దానికి సంబంధించిన డబ్బులు బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా..? ఏమైనా సాయం కావాలా..?' అని అడిగినట్లు చెప్పుకొచ్చిందట శాంతి. శ్రీహరి గారు చనిపోయిన తరువాత కూడా ఆయన నటించిన సినిమాలు రిలీజ్ అయ్యాయని.. కానీ బాలయ్యలా ఎవరూ ఫోన్ చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: