చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే. చిరంజీవి, చరణ్ ఇప్పటికే పలు సినిమాలలో కలిసి నటించగా శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో నటించారు.
అయితే ఒకే పోస్టర్ లో చిరంజీవి పవన్ చరణ్ ఉన్న ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనల్ని ఎవడ్రా ఆపేది అనే క్యాప్షన్ తో ఉన్న ఈ పోస్టర్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

చిరంజీవి, పవన్, చరణ్ కలిసి కనిపిస్తున్న పోస్టర్ పూనకాలు వచ్చేలా ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ముగ్గురు స్టార్ హీరోలు బ్లాక్ షర్ట్ లో పోస్టర్ లో కనిపించారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్ అయినప్పటికీ రియల్ పోస్టర్ ను తలపించే విధంగా ఈ పోస్టర్ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ ముగ్గురు స్టార్ హీరోలు వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఈ ముగ్గురు హీరోలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా వచ్చే నెల 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నెల 28వ తేదీన అనంతపురంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. నయనతార, సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటించగా వీళ్లిద్దరూ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవుతారో లేదో చూడాల్సి ఉంది. గాడ్ ఫాదర్ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో బిజీగా ఉండగా పవన్ కళ్యాణ్ త్వరలో హరిహర వీరమల్లు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నారు. సరైన కథ దొరికితే చిరంజీవి, పవన్, చరణ్ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చిరంజీవి ఒక్కో సినిమాకు 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుండగా చరణ్, పవన్ ఒక్కో సినిమాకు 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: