మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళం లో భారీ విజయ అందుకున్న లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమిక్స్ చేసి విడుదల చేయబోతున్నారు డైరెక్టర్ మోహన్ రాజా. మెగా అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు తగిన మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్టు తెలుగులో వర్కౌట్ అవుతుందా అని విధంగా వార్తలు కూడా వినిపించాయి అయితే ఒరిజినల్ వెర్షన్ కథను తెలుగులో కూడా ఆల్రెడీ విడుదల అయింది అందుచేతనే ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే విషయంపై పలు అనుమానాలు మొదలవుతూ ఉన్నాయి.


ఇక చిరంజీవి పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ సినిమా లో నయనతార, పూరి జగన్నాథ్ సత్యదేవ్ సునీల్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. చిరంజీవి నటించిన దత్త చిత్రం ఆచార్య కూడా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో గాడ్ ఫాదర్ సినిమాని కొనడానికి బయ్యర్లు ముందుకు రావడంలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమా ప్రమోషన్స్ బాగానే జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక ఈ నేపాధ్యంలోని గాడ్ ఫాదర్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ని పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ పాట కోసం ఒక స్పెషల్ సెట్ వేసి కోటీపైగా ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో బింబిసారా సినిమాలో స్పెషల్ సాంగ్ మెప్పించిన ముద్దుగుమ్మ హరిన హుస్సేన్ నటిస్తూ ఉన్నట్లు సమాచారం. కాగ గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నాడు. ఇక దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా విద్యల కాబోతోంది ఇప్పటికి సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని అనంతపూర్ లో చాలా గ్రాండ్గా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: