ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్లో ఉన్నారా.. లేదంటే అభిమానులను,ప్రేక్షకులను , జనసైనికులను కన్ఫ్యూజ్ లో పడేస్తున్నారా అనే విషయం క్లారిటీ రాలేదు.. వీటన్నిటికీ క్లారిటీ రావాలి అంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ స్పందించాల్సిందే అంటూ అభిమానుల సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఎందుచేత అంటే తాజాగా పవన్ కళ్యాణ్ లుక్ మారిపోయింది. పొలిటికల్ వైపు అడుగులు వేయడం జరిగింది. పైగా తాజా ఫోటోలు చాలా అనుమానాలకు దారితీస్తున్నాయని చెప్పవచ్చు. ఇంతకీ ఏంటా ఫోటోలు వాటిలో ఏముందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.పవన్ కళ్యాణ్ ఎప్పుడేప్పుడు షూటింగ్ వైపు అడుగులు వేస్తారా అంటు నిర్మాతలు,డైరెక్టర్లు, అభిమానులు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడూ పొలిటికల్ మూడ్ లోనే ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రింద వరకు జనంలోనే ఉన్న ఇప్పుడు మాత్రం మళ్లీ సినిమాల వైపు తన మనసు మళ్లినట్లుగా ఈ గెటప్పులను చూస్తే మనకి అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రాలతో పాటుగా.. భగవద్వీడు భగత్ సింగ్, డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో, డైరెక్టర్ సముద్రఖనీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నారు. అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా మరొక సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు.


హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మరో నెల రోజుల్లో పూర్తి అవ్వని నేపథ్యంలో అక్టోబర్ లో ఈ సినిమా కోసం డేట్స్ ఇస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా బయటకు వచ్చిన ఫోటోలుతో అందరికీ షాక్ ఇచ్చారు అందులో పవిత్రమైన సరస్వతి పంచమి రోజున సరస్వతి ఆశీస్సులతో హరిహర వర్క్ షాప్ అని రాసి ఉన్నది. అంతేకాకుండా హరిహర వీరమల్లు బ్యాలెన్స్ పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నట్లు గా కూడా తెలుస్తోంది.. అంతేకాకుండా నిన్నటి రోజు నుండి కాస్త మాస్ లుక్ లో కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: