ఇటీవలే కాలంలో ప్రేక్షకులకు కొత్తరకం సినిమాలే నచ్చుతున్నాయి. లుక్స్ నుంచి టేకింగ్ వరకు ప్రతీదీ కొత్తగా ఉంటేనే సినిమా ను ఆదరిస్తున్నారు. అలా సినిమా ను కొత్తగా చేసే నాని అలా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కొంతమంది ఫ‌లితంతో సంబంధంలేకుండా ప్రేక్షకుల‌కు కొత్త క‌థ‌ల‌ను చూపించాలకుంటారు. అలా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అతికొద్ది మంది ఉంటారు. అలాంటి న‌టుల‌లో నాని ఒక‌డు. తొలినుంచి ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేసే నాని ఇప్పుడు మాస్‌ ఆడియెన్స్‌లో క్రేజ్‌ తెచ్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.

అందులో భాగంగానే ఓ మాస్ చేస్తున్నాడు. ఇటీవ‌లే ఈయన నటించిన ‘అంటే సుంద‌రానికీ’ విడుదలై యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమా లో క్లాస్ పాత్ర చేసిన నానిసినిమా ద్వారా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాడు. వాస్తవానికి నాని సినిమాల‌కు టాక్ బాగానే వ‌స్తున్నా క‌మ‌ర్షియ‌ల్‌గా బ్లాక్‌ బస్టర్‌ విజయాలు సాధించలేక పోతున్నాయి.దాంతో అయన కన్నా వెనకాల వచ్చిన హీరోలు స్టార్ లు గా ఎదుగుతుంటే నాని మాత్రం అక్కడే ఆగిపోయాడు.  నిజానికి నాని నటించిన గత ఐదారు చిత్రాలు కూడా కలెక్షన్ల పరంగా యావరేజ్‌గానే మిగిలాయి. దాంతో ఈ హీరో తో సినిమా చేయడానికి నిర్మాతలు జంకుతున్నారు.

 ఈ క్రమంలో నాని ‘ద‌స‌రా’ అనే మాస్ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మాస్ చిత్రంతో గ‌తంలో ఎన్నడు చేయ‌లేని అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి అవుట్ ఫుట్ వేరే లెవెల్ అని చెప్పాలి.  ఈ చిత్రంతో ఎలాగైనా మాస్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకోవాలని గ‌ట్టి ప్రయ‌త్నాలే చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఆయనకు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.  శ్రీకాంత్‌ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: