బాహుబలి సినిమాతో టాలీవుడ్ హీరో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు టాలీవుడ్ లెబెల్ స్టార్ గా ప్రేక్షకులకు డార్లింగ్ గా కొనసాగిన ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దీంతో బాలీవుడ్ దర్శకులు అందరూ కూడా ప్రభాస్తో సినిమాలు తీసేందుకు తెగ ఆరాటపడిపోవడం మొదలుపెట్టారు.  అయితే బాహుబలి తర్వాత మాత్రం ప్రభాస్కి ఏ ఒక్క సినిమా కలిసి రావడం లేదు.  భారీ యాక్షన్ మూవీగా తరకెక్కిన సాహూ, మొన్నటికి మొన్న హిస్టారికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన రాధేశ్యమ్  ఈ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య వచ్చి తీవ్రంగా నిరాశపరిచాయి..


 ఇక ఇప్పుడు ఆది పురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల చేయగా మళ్లీ బాలీవుడ్ వాసన కొడుతుంది. సాహూ రాధేశ్యామ్ సినిమాలలో అయినా కాస్త టాలీవుడ్ టచ్ కనిపించింది. కానీ ఇక ఆదిపురుష్ లో మాత్రం పూర్తిగా బాలీవుడ్ సినిమాలాగే ఉంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ సినిమా లాగా ఉండడం టాలీవుడ్ ప్రేక్షకులకు అసలు నచ్చడం లేదు. దీంతో ప్రభాస్ సినిమాలు పెద్దగా హిట్ కాలేకపోతున్నాయి. సలారు తెలుగు సినిమా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ టేకింగ్ లో కన్నడ టచ్ ఉంటుంది. ప్రాజెక్టు కే లో కూడా అటు ప్రభాస్ తర్వాత కీలక పాత్రలన్ని బాలీవుడ్ నటులే చేస్తున్నారు.


 దీంతో ఇకనైనా ప్రభాస్ పంథా మార్చుకుంటే బెటర్ అనే అభిప్రాయం కొంతమంది అభిమానుల నుంచి వ్యక్తం అవుతుంది అన్నది తెలుస్తుంది. నేరుగా తెలుగు సినిమా చేసి ఆ సినిమాను ఇక హిందీ తమిళ్ కన్నడ భాషలో డబ్ చేసుకుంటే బెటర్ అనే టాక్ ప్రస్తుతం  ఇండస్ట్రీలో వినిపిస్తోంది  కథలో దమ్ము ఉంటే తెలుగు వర్షన్ లో తీసి మిగతా భాషల్లో డబ్ చేసిన సినిమా హిట్ అవుతుంది అన్నదానికి ఇప్పటికే ఎన్నో టాలీవుడ్ సినిమాలు నిదర్శనంగా ఉన్నాయని ప్రభాస్ కూడా ఇదే పంథా ఫాలో అయితే బెటర్ అన్నవాదన వినిపిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: