టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శర్వానంద్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించి అలాగే ఎన్నో విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శర్వానంద్ "ఒకే ఒక జీవితం" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కి శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించాడు. దర్శకుడు శ్రీ కార్తిక్మూవీ ని టైం ట్రావెలర్ జోనర్ లో తెరకెక్కించాడు. ఈ మూవీ లో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటించగా ,  వెన్నెల కిషోర్ , ప్రియదర్శిమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. అక్కినేని అమలమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఒకే ఒక జీవితం మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ ప్రేక్షకులను ఎంత గానో అలరించి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఒకే ఒక జీవితం మూవీ మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఒకే ఒక జీవితం మూవీ ప్రముఖ "ఓ టి టి"  హక్కులను ప్రముఖ "ఓ టి టి"  సంస్థలలో ఒకటి అయినటు వంటి సోనీ లీవ్ "ఓ టి టి" సంస్థ దక్కించుకున్నట్లు ,  ఈ మూవీ ని సోనీ లీవ్  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో  అక్టోబర్ 10 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: