ఏంటి..ఆ స్టార్ విడాకులు తీసుకోబోతున్నారా ..?సినీ ఇండస్ట్రీకి ఏమైంది..? ఎందుకు ఇలా వరుస జంటలు విడాకులు తీసుకుంటున్నారు..? ఇలాంటి విడాకులు అనే పదానికి జనాలు విసుగెత్తిపోతున్నారట . ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పదం విడాకులు. ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయినా అప్పుడే పెళ్లి చేసుకునే యంగ్ జంట అయినా సరే విడాకులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా విడాకులు తీసుకొని వేరువేరుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. దీంతో స్టార్స్ ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు అనే ఆనందం మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందట.
ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో బోలెడు మంది స్టార్ కపుల్స్ విడాకులు తీసుకుని అభిమానులను షాకింగ్ గురి చేసిన విషయం తెలిసిందే . రీసెంట్గా ఇలా విడాకులు తీసుకొని వేర్వేరుగా బ్రతకడానికి సిద్ధపడ్డారు స్టార్ జంట అంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ చందమామగా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటర్ అయిన కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత మగధీర సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ బ్లాక్ బస్టర్ హిట్టుతో వెనుతిరిగి చూసుకునే పని లేకుండా పోయింది . వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిగ్ బిగ్ స్టార్స్ తో నటిస్తూ ఇట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కెరియర్ ని జెట్ స్పీడ్ లో దూసుకుపోయే విధంగా ప్లాన్ చేసుకుందట.

అయితే సినీ ఇండస్ట్రీలో తన చెల్లిని కూడా భాగం చేయాలి అని అనుకోని కాజల్ తన చెల్లెలు నిషా అగర్వాల్ ని కూడా హీరోయిన్గా రంగంలోకి దింపింది. నిషా అగర్వాల్ కూడా తెలుగు, మలయాళం లో పడి సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది . కానీ అక్కతో కంపేర్ చేస్తే చెల్లి పెర్ఫార్మెన్స్ లెవెల్స్ చాలా లో అంటూ జనాలు కామెంట్స్ కూడా చేశారు. దీంతో ఈ సినీ ఇండస్ట్రీ నాకు వర్కౌట్ కాదు అంటూ నిషా అగర్వాల్ పెళ్లి చేసుకుని సెటిలైపోయింది . 2013లో డిసెంబర్ లో నిషా అగర్వాల్ మాన్ కరణ్ అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన సరే నిషా అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుందట.కాగా వీరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా నిషా అగర్వాల్ భర్తతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడింది అంటూ ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే దీనిపై ఇప్పటివరకు కాజల్ కాని నిషా అగర్వాల్ కాని అటువైపు బంధువులు కానీ ఎవరు స్పందించలేదు మరి చూడాలి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో. అయితే అభిమానులు మాత్రం మీ జంట విడాకులు తీసుకోకపోతే బాగుండు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: