పవన్
కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వాటిలో హరిహర వీరమల్లు
సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలవబోతుంది. ప్రస్తుతం ఈ
సినిమా యొక్క ఫ్రీ షెడ్యూల్ వర్క్ షాప్ పనులలో ఉన్న చిత్ర బృందం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ చేయడానికి సిద్ధమవుతుంది. ఈ నేపద్యంలో ఈ
సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి.
జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ
సినిమా ఎప్పుడో పూర్తవవలసినది కానీ ఈ చిత్రానికి సంబంధించిన కథ భారీగా ఉండటంతో కథనం పట్ల పవన్
కళ్యాణ్ కాంప్రమైజ్ అవ్వకపోవడంతో ఈ
సినిమా తెరకెక్కడానికి ఇన్ని రోజులు సమయం తీసుకోవాల్సి వచ్చింది. దానికి తోడు పవన్
కళ్యాణ్ ఇతర సినిమాలలో బిజీగా ఉండడంతో ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణను పూర్తిగా పక్కన పెట్టేశాడు. చివరగా ఈ సినిమాను మొదలు పెట్టవలసిన సమయం రావడంతో ఈ చిత్రాన్ని ఆయన మొదలుపెట్టడని చెప్పవచ్చు.
కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను వేసవి లో విడుదల చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేయగా ఇప్పుడు ఏర్పడిన పరిస్థితుల రీత్యా ఈ సినిమాను వేసవిలో కాకుండా ఆ తరువాత విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుందట. చారిత్రాత్మక
సినిమా కావడంతో భారీ కాన్వాస్ ఉన్న
సినిమా కావడంతో ఈ చిత్రాన్ని చేయడానికి ఎక్కువ రోజుల సమయం తీసుకోబోతున్నారట. చరిత్రాత్మక
సినిమా అనగానే ప్రతి ఒక్కరికి
బాహుబలి సినిమా గుర్తుకు వస్తుంది. అంతటి స్థాయిలో ఈ సినిమాను నెలకొల్పేందుకు ఈ విధమైన ప్రణాళిక రూపొందిస్తున్నారట. మరి ఈ
సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి అంటే మరికొన్ని రోజులు ఎదురు చూడవలసిన అవసరం ఏర్పడింది. దీని పట్ల పవన్ అభిమానులు కాస్త నిరాశగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.