మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ డ్రామా 'గాడ్ ఫాదర్'. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' ఆధారంగా ఈ మూవీని తెలుగులో మోహన్ రాజా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో  దసరా సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ స్థాయిలో మాత్రం వసూళ్లని రాబట్టలేక పోయింది. దీంతో ట్రేడ్ వర్గాలు షాక్ కు గురవుతున్నారట.పండగ సీజన్ లో కూడా ఈ స్థాయి వసూళ్లేంటీ బాబు అని షాక్ అవుతున్నారట. గతంలో దాదాపు పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా వున్న మెగాస్టార్ 'ఖైదీ నంబర్ 150'తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. తొలి రోజు ఏకంగా రూ. 23 కోట్లకు మించి షేర్ని రాబట్టి చిరు సత్తా ఇప్పటికీ తగ్గలేదని మరో సారి నిరూపించింది. అయితే 'గాడ్ ఫాదర్' మాత్రం ఈ మొత్తంలో కేవలం రూ. 13 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టి షాకిచ్చింది.దీనికి కారణం ఏంటా అని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు ఆరా తీస్తున్నారు. గతంలో ఫ్లాప్ సినిమా అయినా సరే పండగ వేళ రిలీజ్ అయితే థియేటర్లు కళ కళ లాడేవి.. జనంతో నిండిపోయివి. దీంతో టాక్ తో సంబంధం లేకుండా ఫ్లాప్ సినిమాలు కూడా భారీ స్థాయిలో వసూళ్లని రాబట్టేవి.


కానీ ఇప్పడు అలా జరగడం లేదు. హిట్ సినిమాకు కూడా వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. కారణం పెరిగిన టికెట్ రేట్లేనని మరో సారి తేలింది.ఆ కారణంగానే సగటు ప్రేక్షకుడు థియేటర్లకు రావడానికి సాహసించడం లేదని ఒక్కో ఫ్యామిలీ థియేటర్ కు రావాలంటే అక్షరాలా రూ. 1500 నుంచి రూ. 2000 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.పైగా అమౌంట్ లో సగం ఖర్చు చేస్తే ఇంటిల్లిపాదీ ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండానే 4కెలో సినిమా చూసేయొచ్చు. ఓటీటీ ల్లో రోజూ ఓ సినిమా చూసుకునే వెలుసుబాటు వుండటం వల్లే సగటు ప్రేక్షకుడు వేలు ఖర్చు చేసి థియేటర్లకు రావడానికి సాహసించడం లేదని 'గాడ్ ఫాదర్'తో మరోసారి రుజువైంది. అందుకే గాడ్ ఫాదర్ కి అనుకున్నంత వసూళ్లు రావడం లేదు. పైగా సినిమా హిట్ టాక్ తెచ్చుకుందని జనాల రాక కోసం చిరంజీవి టీం ఫేక్ వసూళ్లతో ప్రచారం చేస్తుంది. కానీ సినిమా మాత్రం చాలా ఘోరమైన నష్టాల్లో ఉందని సమాచారం తెలుస్తుంది.ప్రస్తుతం 40 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇంకా 50 కోట్లపైగా వసూళ్లు రాబడితే సినిమా సేఫ్. కానీ అది చాలా కష్టంలాగా కనిపిస్తుంది.చూడాలి మరి సినిమా లాంగ్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: