రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ
సినిమా చేస్తున్న విషయం తెలి సిందే. రకరకాల ఊహాగానాల మధ్య ఈ
సినిమా యొక్క అనౌన్స్మెంట్ అధికారికంగా జరిగింది. చాలామంది చాలా రకాలుగా ఈ
సినిమా గురించి చెప్పారు.
జోనర్ విషయమై చాలా మంది చాలా చర్చలు పెట్టారు. కానీ
రాజమౌళి మాత్రం ఇప్పటిదాకా ఈ
సినిమా ఏ
జోనర్ లో తెరకెక్కుతుంది అన్న విషయాన్ని మాత్రం బయటకు పెట్టలేదు. ఎప్పుడో వీరి కాంబి నేషన్లో
సినిమా రావాల్సి ఉంది.
కానీ వీరిద్దరి కమిట్ మెంట్ల కారణం వల్ల ఈ
సినిమా ఇప్పుడు కార్య రూపం దాల్చుతుంది. ఫైనల్ గా ఈ కాంబో నుంచి
సినిమా కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు అని చెప్పాలి. వచ్చే ఏడాది వేసవి నుంచి ఈ
సినిమా యొ క్క షూటింగ్ మొదలు కాబోతుండగా 2024 లోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు
రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు దగ్గరుండి చూసుకుంటూ ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందించే విషయం లో ఎలాంటి కాంప్రమైజ్ ఉందొడ్డు అని నిర్మాతలకు సూచిస్తున్నాడట.
ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం
త్రివిక్రమ్ దర్శకత్వంలో
సినిమా చేస్తూ ఉండగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేశాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో పాన్
ఇండియా సినిమా చేయడానికంటే ముందు రాబోతున్న ఈ
సినిమా భారీ విజయాన్ని అందుకోవాలని
త్రివిక్రమ్ మంచి ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేసి సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచనున్నాడు. మరి తొలిసారిగా మహేష్ బాబు రాజమౌళితో కలిసి చేస్తున్న
సినిమా కావడంతో ఆ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.