టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత చాలా రోజులుగా సినిమా షూటింగ్ లలో, పూర్తయిన సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడం లేదని చెప్పుకుంటున్నారు. కారణం ఏదైనా కూడా ఆమె ఈ విధంగా అందుబాటులో లేకపోవడం సదరు సినిమాలకు ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది అని అంటున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పుష్ప సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఇప్పుడు రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు ఒక అగ్ర హీరో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తూ ఉంది. ఇప్పటికే ఆ రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాల యొక్క షూటింగ్ లను సమంత పూర్తి చేసింది. అవి విడుదలకు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే వాటికి సంబంధించిన విడుదల జరగనున్న నేపథ్యంలో ఆ చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్లాన్ వేశాయి చిత్ర బృందాలు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాలు ఈమె కోసమే వేచి చూస్తున్నాయని చెప్పాలి.

సమంత ఎప్పుడు తిరిగి వస్తుందా తమ సినిమాను యొక్క విడుదలను ఎప్పుడు అనౌన్స్ చేయాలా అన్నట్లుగా వారు ఎదురుచూస్తున్నారట. గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే ఓ మైథాలజికల్ సినిమాలో నటించిన సమంత అదే సమయంలో మరొక సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా అయినా యశోద లో కూడా కీలకపాత్రలో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకు వస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు సమంత అభిమానులు. ఇక విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ పెండింగ్ లో ఉంది. సమంత డేట్లు లేని కారణంగానే ఈ సినిమా యొక్క షూటింగ్ చేయడం లేదు అని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాను తిరిగి మొదలు పెట్టనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: