మెగాస్టార్
చిరంజీవి సినిమాల పట్ల ఎంత క్లారిటీగా ఉంటారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి
సినిమా కూడా సూపర్ హిట్ అవడానికి కారణం ప్రతి చిన్న విషయంలో కూడా స్పష్టత కోరుకునే వ్యక్తి ఆయన అపజయాలకంటే విజయాల శాతమే ఎక్కువగా ఉంటుంది. అలా ఇటీవల కాలంలో కొంత ప్రేక్షకులను నిరాశ పరుస్తూ వస్తున్న
మెగాస్టార్ చిరంజీవి ఇకపై హిట్ సినిమాలను చేయాలని భావిస్తున్నాడు. అందుకే రాబోయే సినిమాలతో ప్రేక్షకులను అలవించడానికి ఎక్కువగా శ్రద్ధ వహిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే దర్శకుల పట్ల ఎంతో కఠినంగా ఉండడం జరుగుతుంది.
గాడ్ ఫాదర్ సినిమా విషయంలో ఏకంగా ఇద్దరు దర్శకులను దయాదాక్షిన్యాలు లేకుండా పక్కన పెట్టేయడం కేవలం చిరంజీవికే చెల్లింది. కథ విషయంలో కథనం విషయంలో తనను నడిపించకపోతే మాత్రం తప్పకుండా ఎలాంటి దర్శకుడినైనా పక్కన పెట్టడానికి పెద్దగా ఆలోచించను అని ఆయన దాని ద్వారా చెప్పినట్లు అయింది. ఇకపోతే ఇప్పుడు
వెంకీ కుడుముల దర్శకత్వం లో చేయవలసిన
సినిమా కూడా క్యాన్సల్ అయిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కథతో చిరంజీవిని నడిపించిన
వెంకీ కుడుముల పూర్తి నేరేషన్ తో చిరంజీవిని ఏమాత్రం నేర్పించలేకపోయాడట. దాంతో ఈ సినిమాను కూడా
చిరంజీవి పక్కన పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఎవరితో
సినిమా చేయాలన్నా కూడా
చిరంజీవి కథ విషయంలో పక్కాగా ఉన్న తర్వాతనే వారితో ముందుకు వెళతాడట. ఈ నేపథ్యంలో ఆయన దగ్గరికి వచ్చే దర్శకులు కథా కథనాల విషయంలో పూర్తి పర్ఫెక్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం
బాబీ దర్శకత్వంలో సినిమాను పూర్తి చేస్తున్న
చిరంజీవి భోలా
శంకర్ సినిమాను కూడా పూర్తి చేశాడు. ఈ రెండు సినిమాలను వచ్చే ఏడాదిలో విడుదల చేయబోతున్నాడు. మరి అయన తదుపరి ఎవరితో సినిమాలు చేయాలో ఇంకా నిర్ణయించలేదు కాబట్టి ఎవరితో సినిమాలు చేస్తాడో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో మరీ.