ఒక హీరోయిన్ కు రాని అవకాశాలు అనసూయకు తెగ వస్తుండడంతో ఇండస్ట్రీ ఆమె గురించే చర్చించుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 'నాగ' సినిమాలో మొదటిసారిగా కనిపించిన అనసూయ ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలే అవుతోంది. దీంతో అసలు అనసూయ సినీ పరిశ్రమకు ఎప్పుడు వచ్చారు..? ఆమె వయసు ఎంత ఉంటుందనే చర్చ బాగ సాగింది. కానీ ఇటీవల తనే తన వయసు గురించి చెప్పి ఆశ్చర్యపరిచింది.
జబర్దస్త్ ప్రొగ్రాం ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ఓ వైపు టీవీల్లో కనిపిస్తూనే సినిమాల్లో చాలా బీజీగా మారింది. అనసూయ మొదట్లో సైడ్ క్యారెక్టర్ గా నటించింది. ఎనిమిదేళ్ల కిందట వచ్చిన నాగ సినిమాలో అనసూయ చిన్న పాత్రలో కనిపిస్తుంది అంటా మరి . ఆ తరువాత వెండితెర కలిసి రాకపోవడంతో టీవీల వైపు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెకు జబర్దస్త్ లో చాన్స్ వచ్చింది. అందులో ఆమె ప్రతిభ చూపించడంతో స్టార్ యాంకర్ గా మారిపోయింది. ఆ తరువాత పలు టీవీ ప్రొగ్రాముల్లోనూ అనసూయ సందడి చేసింది.
ఓ వైపు టీవీల్లో కనిపిస్తూనే మరోవైపు సినిమాల్లో మంచి అవకాశాలను చేజిక్కించుకుంది. అయితే 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా నటించి స్టార్ ఇమేజ్ ను తెచ్చుకుంది. ఆ తరువాత వరుసగా సినిమా అవకాశాలు రావడంతో జబర్దస్త్ ప్రొగ్రాం నుంచి వెళ్లిపోయింది. కొన్ని నెలల కిందట రిలీజైన 'పుష్ప'లో అమె నటనకు చాలా మంది ఫిదా అయ్యారు. దీంతో పుష్ఫ 2 లోనూ అమెకు కీ రోల్ ను ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రధాన పాత్రలో 'దర్జా' అనే మూవీలోనూ అలరించింది ఈ భామ.
ఇలా సినిమాల్లో బిజీగా మారిన అనసూయ వయసు ఎంత ఉంటుంది..? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అయతే ఇంతకాలం 40 ప్లస్ అని ప్రచారం సాగింది. కొందరు ఆమెకు చిన్నప్పుడే పెళ్లయిందని.. కానీ వయసు తక్కువగానే ఉంటుందని అన్నారు. కానీ ఈ చర్చకు అనసూయే పులి స్టాప్ పెట్టింది. ఆమె వయసును ఆమె స్వయంగా చెప్పి ఆశ్చర్యపరిచింది.
సాధారణంగా అమ్మాయిల వయసు అడక్కూడదని అందరూ అంటారు. కానీ అనసూయ మాత్రం తన వయసు 36 అని చెప్పింది మరీ . అదీ.. తోటి యాంకర్ సుమ సాక్షిగా.. దీంతో ఇంతకాలం సోషల్ మీడియాలో రకరకాల కథనాలకు పులి స్టాప్ పెట్టినట్లయింది మరీ .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి