ప్రభాస్ హీరోగా
మారుతి దర్శకత్వంలో ఓ
సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫోటో షూట్ ఇటీవలే జరగగా ఈ
సినిమా త్వరలోనే షూటింగ్ జరుపుకోపోతుంది అని చెప్పడానికి ఇది నిదర్శనం అని చెప్పవచ్చు. ఇప్పటిదాకా చిన్న మీడియం రేంజ్ హీరోలకు మాత్రమే దర్శకత్వం చేస్తూ వచ్చిన
ప్రభాస్ తొలిసారిగా ఒక పాన్
ఇండియా స్టార్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఆ విధంగా
ప్రభాస్ రిలీఫ్ కోసమే ఈ సినిమాను చేస్తూ ఉండగా ఇప్పటిదాకా ఆయన చేసిన సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో కూడిన సినిమాలే. ప్రస్తుతం కూడా నాలుగైదు సినిమాలను భారీ స్థాయిలో చేస్తున్న నేపథ్యంలో
మారుతి కథను నచ్చిన
ప్రభాస్ ఈ
సినిమా చేయడానికి అంగీకరించాడు. హార్రర్
థ్రిల్లర్ నేపథ్యంలో ఈ
సినిమా రూపొందుతుంది అని చెబుతున్నారు. అయితే ఈ
సినిమా హారర్ అయినప్పటికీ
ప్రభాస్ ను దెయ్యం ఆవహించడం తో ఆయన దెయ్యం లా నటిస్తున్నాడని చెబుతున్నారు. అయితే దయ్యంలా నటించినా కూడా అందరిని భయపెట్టకుండా ఈ
సినిమా ద్వారా ఆయన నవ్వుల పువ్వులు పూయిస్తాడని అంటున్నారు.
ఇక ఆయన హీరోగా నటించిన
ఆది పురుష్ చిత్రం ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతుంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ
సినిమా మైథాలజికల్ చిత్రంగా భారీ బడ్జెట్ తో రూపొందగా
బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఈ
సినిమా తెరక్కింది. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ
సినిమా ప్రభాస్ కి ఎలాంటి విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. ఈ
సినిమా తర్వాత ఆయన ప్రేక్షకుల ముందుకు సలార్ అనే సినిమాను తీసుకురాబోతున్నాడు. వచ్చే ఏడాది వేసవి లో ఆ సినిమాను విడుదల చేయబోతున్నాడు. ఆ విధంగా సలార్ చిత్రం తర్వాత ఇప్పుడు చేస్తున్న
మారుతి సినిమా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశాడు ప్రభాస్.