టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా , మీనాక్షి చౌదరిమూవీ లో అడవి శేసి సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని నాచురల్ స్టార్ నాని నిర్మించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చేసింది.

ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే హిట్ ది సెకండ్ కేస్ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 3.11 మిలియన్ వ్యూస్ ను , 128.2 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే హిట్ ది సెకండ్ కేస్ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఎలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు  మరింతగా పెరిగిపోయాయి. మరి హిట్ ది సెకండ్ కేస్ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే డిసెంబర్ 2 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: