టాలీవుడ్లో ఈ మధ్యకాలంలో వరుసగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ భారీగానే విడుదలవుతున్నాయి. ఈ చిత్రాలు అన్ని ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా వికాస్ వశిష్ట, 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు, ప్రియ వడ్లమాని ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ముఖచిత్రం. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో విశ్వక్ సేన్ నటిస్తూ ఉన్నారు. డిసెంబర్ 9వ తేదీన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండడంతో ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ప్రమోషన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు తాజాగా ట్రైలర్ను కూడా విడుదల చేయడం జరిగింది.


ట్రైలర్ విషయానికి వస్తే రోడ్డు ప్రమాదానికి గురైన ఒక మహిళ ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత ఆ ప్లాస్టిక్ సర్జరీ తీవ్ర గందరగోళానికి గురవుతున్న కారణమన్నట్లుగా విచిత్రాన్ని తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్ చూస్తే మనకి అర్థమవుతోంది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న మహిళగా ప్రియా వడ్లమాని నటించగా.. సర్జన్ చేసిన వ్యక్తిగా వికాస్ వసిస్ట్ నటించారు. వికాస్ స్నేహితుని పాత్రలో చైతన్య రావు కనిపించారు. లాయర్ విశ్వామిత్రగా విశ్వక్సేన్ నటించారు.

మొట్టమొదటిసారిగా విశ్వక్సేన్ నల్లకోటు ధరించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది.కలర్ ఫోటో ఫ్రేమ్ సందీప్ రాజా ఈ సినిమాకి కథ స్క్రీన్ ప్లే మాటలు అందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా డైరెక్టర్ కొత్త దర్శకుడు గంగాధర్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ప్రేక్షకులను ఉత్కంఠంగా ఉత్సాహంగా నిలబలిపే విధంగా ఈ ట్రైలర్ ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందని  విస్వక్ అభిమానుల సైతం భావిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 9వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కూడా లవ్ స్టోరీ ట్రయాంగిల్ లో ఉన్నట్లుగా ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: