ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ ని ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ఈ మూవీ యూనిట్ ప్రకటించలేదు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న తలపతి విజయ్ ప్రస్తుతం వరిసు అనే తమిళ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.

మూవీ ని తెలుగులో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ రెండు సినిమాలు కనక జనవరి 12 వ తేదీన విడుదల అయినట్లు అయితే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇద్దరు హీరోల సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద భారీ యుద్ధమే జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: