టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి సాయి దరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయి ధరమ్ తేజ్ "పిల్ల నువ్వు లేని జీవితం" మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఆ తరువాత సుప్రీమ్ , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ లతో మంచి విజయాలను అందుకొని తన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరింత గా పెంచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ప్రస్తుత కార్తీక్ దండు దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యే చాలా రోజులు అవుతుంది. అలాగే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. 

ఇప్పటివరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా సాయి దరమ్ తేజ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యం లో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం "ఎస్ డి టి 15" అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి డిసెంబర్ 7 వ తేదీన టైటిల్ గ్లి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నిన్న ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ మరో అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ యొక్క టైటిల్ గ్లిమ్స్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: