ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇక ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలను దాటేసి సరికొత్త ట్రెండ్ సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటివరకు ఏకంగా 150 కి పైగా సినిమాల్లో నటించి 60 ఏళ్ల వయసులో కూడా కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఎంతోమంది జూనియర్ హీరోలు స్టార్ హీరోలుగా మారిపోయిన తర్వాత కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే ఇప్పుడు వరకు చిరంజీవి తన కెరీర్ లో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులతో నటించారు.  అయితే ఒకప్పుడు చిరంజీవి పక్కన కీలక పాత్రల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు ఇక ఇప్పుడు హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.


 గతంలో చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమాలో చిన్నప్పటి చిరంజీవిగా నటించిన తేజ సజ్జ ఇక ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే మెగాస్టార్ కెరియర్ లో మర్చిపోలేని చిత్రం పసివాడి ప్రాణం. చిరంజీవి వన్ మ్యాన్ షో గా నడిచిన ఈ సినిమా ఇక సూపర్ హిట్ సాధించింది అని చెప్పాలి. ఒక చిన్న బాబు కోసం మెగాస్టార్ చేసే సాహసాలు ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాకు అప్పట్లో మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి అందించిన సంగీతం అయితే ప్రేక్షకులను కన్నీరు పెట్టించింది అని చెప్పాలి.


 ఈ సినిమా మొత్తం ఒక చిన్న బాబు చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ పాత్ర పేరే రాజా. అయితే ఇలా ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన రాజా పాత్రలో నటించిన చిన్నారి ఎవరు.. ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఒకప్పుడు చిరంజీవి సరసన మాటలు రాని చిన్నారిగా చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన చిన్నారి ఎవరో కాదు సుజిత. ప్రస్తుతం ఆమె టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. కొన్ని సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు. జై చిరంజీవ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో కూడా నటించారు సుజిత.

మరింత సమాచారం తెలుసుకోండి: