ఎన్నో ఏళ్లుగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా మంచి పాపులారిటీని అందుకున్న ఎంతోమంది కమెడియన్లు సినిమాలలో సైతం అవకాశాలను అందుకుంటున్నారు. ఇక అందులో ఒకరే గెటప్ శ్రీను ఈయన కమెడియన్ గా ఈ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ లక్షల్లో రెమ్యూనరేషన్ను అందుకుంటున్నాడు. ఇప్పుడు ఇంత మంచి పాపులారిటీని దక్కించుకున్న ఈయన ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఒకప్పుడు కడుపు నింపుకోవడానికి కూలి పనులను సైతం  చేశాడట. 

పేదవాడిగా పుట్టి ఆయనకున్న ప్రతిభతో ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నాడు. జబర్దస్త్ షో తో ఇంతటి గుర్తింపును పొందిన గెటప్ శ్రీను కి ఒకప్పుడు కనీసం తినడానికి తిండి కూడా లేదట. ఇక 1984 డిసెంబర్ 12న కలింగ పాలెం అనే ఒక పల్లెటూరులో పుట్టాడు ఈయన. ఈయన తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయం చేసుకుంటూ పొట్టనింపుకునేవారు. అందుకే  గెటప్ శీను చిన్నతనం నుండే అన్ని పనులను చేశాడు .అప్పట్లో చదువుకోవడానికి పుస్తకాలు లేక పనులకు వెళ్లే వాడట శీను. దాని అనంతరం నెమ్మదిగా ఒక్క పూట స్కూల్ కి వెళ్ళాడట. ఒకానొక సమయంలో ఇంట్లో తినడానికి తిండి కూడా

 లేని సమయంలో గెటప్ శ్రీను ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువుకున్నాడు. సెలవులు వస్తే ఇంటికి వెళ్లి మళ్లీ కూలి పనులకే వెళ్లేవాడట గెటప్ శ్రీను. అలా ఎన్నో కష్టాలను పడ్డ అనంతరం ఉపాధి కోసం హైదరాబాదుకు వచ్చాడట .ఆయనకి నటన మీద ఉన్న ఆసక్తితో ఎన్నో చోట్ల తిరిగిన గెటప్ శ్రీను అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ కి రావడం జరిగింది.అయితే అక్కడ ఎదురైన ఒక అవమానం గెటప్ శ్రీను భరించలేక చనిపోదామని కూడా అనుకున్నాడట. ఇక అప్పుడే ఆయనకు జబర్దస్త్ లో అవకాశం రావడంతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: