మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇలా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్య అనే ఒక క్రేజీ మూవీ లో హీరో గా నటించాడు. 

శృతి హాసన్ ఈ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించగా ... క్యాథరిన్ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఊర్వసి  రౌటేల ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించగా ... మాస్ మహారాజా రవితేజమూవీ లో ఒక ముఖ్యమైన కీలక పాత్రలో నటించాడు. బాబీ సింహ , ప్రకాష్ రాజ్మూవీ లో ఇతర ముఖ్యపాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని రేపు అనగా జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. అంతకంటే ఒక రోజు ముందుగానే అనగా ఈ రోజే ఈ మూవీ ని యూఎస్ఏ లో ప్రీమియర్ షో లు వేయనున్నారు.

అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ సేల్స్ బుకింగ్స్ కూడా మొదలు అయ్యాయి. అందులో భాగంగా ఈ మూవీ ఫ్రీ బుకింగ్ సేల్స్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి ఇప్పటివరకు 500 కే అడ్వాన్స్ ప్రీ సేల్స్ జరిగాయి. ఈ మూవీ ని శ్లోక ఎంటర్టైన్మెంట్  సంస్థ వారు యూఎస్ఏ లో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: