రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఆస్కార్ అవార్డ్స్ ప్యానల్ కు వచ్చితీరుతుంది అన్నవార్తలతో తెలుగు సినిమా ఖ్యాతి బాగా పెరిగిపోయిందని ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఈప్రశంసలు ఇలా వస్తూ ఉండగానే సంక్రాంతి రేస్ కు విడుదలైన ‘వీరసింహారెడ్డి’ ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆసినిమాలు రెండు కేవలం మూడు నాలుగు రోజులలో 100 కోట్ల కలక్షన్స్ మార్క్ ను దాటిపోయాయి అంటూ సోషల్ మీడియాలో అదేవిధంగా మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చూసి తెలుగు సినిమా ఖ్యాతి పెరిగిందా లేక తరిగిందా అంటూ కొందరు విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.


చిరంజీవి బాలకృష్ణల అభిమానుల మధ్య వార్ ను సృష్టించిన ‘వీరసింహారెడ్డి’ ‘వాల్తేర్ వీరయ్య’ మూవీలను చూసిన సగటు ప్రేక్షకుడుకి పూర్తి ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి అన్నమాట వాస్తవం. ఈరెండు సినిమాలు పూర్తి మాస్ సినిమాలు కావడంతో మరొకసారి మాస్ హీరోలుగా చిరంజీవి బాలకృష్ణ లను మళ్ళీ నిలపెట్టాయి కాని వారి కెరియర్ లో జనం గుర్తు పెట్టుకోతగ్గ సినిమాలు కావు అన్నకామెంట్స్ వస్తున్నాయి.


ఈరెండు సినిమాలలోను ఊచకోత అదేవిధంగా విపరీతమైన హీరోల ఎలివేషన్ తప్ప మరెక్కడా వాస్తవిక దృష్టి కనిపించదు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగకు రెండు సినిమాలు చూసే అలవాటు తెలుగు ప్రేక్షకులకు ఉండటంతో ఈరెండు మాస్ సినిమాలు ఎలా ఉన్నప్పటికీ చూసి ఉంటారు అన్న విశ్లేషణలు కూడ వస్తున్నాయి.


ఈసంక్రాంతి రేస్ లో చిరంజీవి బాలకృష్ణ పై కొంతమేరకు విజయం సాధించి సంక్రాంతి విజేతగా మారినప్పటికీ ఈమూవీతో చిరంజీవికి ప్రత్యేకంగా కలివచ్చే ఇమేజ్ లేదు. ఇప్పటికే చిరంజీవికి 68 సంవత్సరాలు బాలకృష్ణకు 64 సంవత్సరాలు వచ్చిన నేపధ్యంలో తమ వయసుకు తగ్గ మంచి పాత్రలు చేయకుండా ఇలా ఊచకోత మాస్ సినిమాలు చేస్తూ ఉంటే వారికి భారీ పారితోషికాలు వస్తాయేమో కాని తెలుగు సినిమా చరిత్రలో గుర్తు పెట్టుకునే సినిమాలుగా ఇలాంటి మాస్ సినిమాలు మిగలవు అంటూ కొందరు విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: