ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి తెలుగు చిత్ర పరిశ్రమకు ఖ్యాతిని పెంచిన ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది జయసుధ ఇక స్టార్ హీరోయిన్గా ఎంతల హవా నడిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో ఒదిగిపోయి.. ఆ పాత్ర తనకోసం మాత్రమే పుట్టిందేమో అన్న విధంగా తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేది. అందుకే ఇక ఇండస్ట్రీలో సహజనటిగా పేరు సంపాదించుకుంది అని చెప్పాలి. అయితే ఇక తర్వాత కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా జయసుధ ప్రేక్షకులను అలరిస్తూ వరుస అవకాశాలు దక్కించుకుంటూనే వస్తుంది అన్న విషయం తెలిసిందే.


 జయసుధ హీరోలకు తల్లిగా నటించిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, బొమ్మరిల్లు లాంటి సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఎంతో మంది దర్శకులు కూడా హీరో హీరోయిన్ల తల్లి పాత్రల్లో జయసుధ అయితే బాగుంటుంది అని అనుకొని ఆమెకు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు అని చెప్పాలి. కాగా దళపతి విజయ్ హీరోగా నటించిన వారీసు సినిమాలో కూడా విజయ్ తల్లిగా నటించింది జయసుధ. ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.  ఇకపోతే ఇటీవల సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొంది  జయసుధ. ఈ క్రమంలోనే హీరో అజిత్ గురించి జయసుధ కి ఒక ప్రశ్న ఎదురైంది.


 ఇప్పుడు వరకు ఎంతో మంది స్టార్ హీరోలకు తల్లిగా నటించిన మీరు అజిత్ కి తల్లిగా ఎందుకు నటించలేదు అంటూ ఒక విలేకర్ ప్రశ్నించాడు. ఇక ఈ ప్రశ్నపై జయసుధ సమాధానం చెబుతూ.. గతంలో ఒక సినిమాకి అజిత్ గా తల్లిగా నటించే అవకాశం వచ్చింది. కానీ కరోనా వల్ల సినిమా మధ్యలోనే ఆగిపోయింది. కానీ తర్వాత మళ్ళీ షూటింగ్ ప్రారంభమైన కరోనా భయం వల్ల నేను ఆ సినిమా నుంచి తప్పుకున్నాను. ఆ సినిమాలో నా బదులు సుమిత్ర నటించింది. ఇక తర్వాత మళ్లీ అవకాశం రాలేదు. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం తప్పకుండా అజిత్ కి తల్లి పాత్రలో నటిస్తాను అంటూ జయసుధ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: