గత పది సంవత్సరాలుగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణంగా జబర్దస్త్ షో అంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చే పేరు యాంకర్ రష్మీ మరియు సుడిగాలి సుదీర్. వీరిద్దరితో ఈ షోకి మరింత గుర్తింపు లభించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. జోడీగా వీరిద్దరూ కలిసి జబర్దస్త్ షో ని ఇన్ని సంవత్సరాలు లాక్కు వచ్చారని చాలామంది అంటూ ఉంటారు. అయితే వారిద్దరి తర్వాత జబర్దస్త్ షోలో చాలామంది జోడీలుగా మారారు. ఏ జోడి కూడా రష్మీ మరియు సుధీర్ లాగా ఆకట్టుకోలేకపోయారు. 

వీరి అనంతరం వర్ష మరియు ఇమాన్యుల్ జోడి కాస్త అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసిందిమ్ అయినప్పటికీ వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ కాస్త ఫేక్ అంటూ చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అందుకే వారి ఇద్దరినీ కూడా జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే ఇక ఈ మధ్యకాలంలో జబర్దస్త్  లో బులెట్ భాస్కర్ మరియు జడ్జ్ కుష్బూ జోడిగా తెగ హడావిడి చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు ప్రతి ఎపిసోడ్లో కూడా వీరిద్దరూ కలిసి డాన్స్ చేయడం లేదా వీరిద్దరి మధ్య రొమాంటిక్ సంభాషణ సాగడం అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే విడుదలైన ఒక ప్రోమోలో వీరిద్దరూ కలిసి డాన్స్ చేశారు.

అయితే అది కూడా ఒక రొమాంటిక్ సాంగ్ కి. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల్లో మరియు ఎంతో మంది సీనియర్ హీరోలతో డాన్స్ చేసిన కుష్బూ ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ తో డాన్స్ చేస్తూ ఉండడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఇదంతా ఈ షో టిఆర్పి రేటింగ్ కోసం అయినప్పటికీ దీన్ని చూసి చాలామంది షాక్ అవుతున్నారుమ్ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య ఇంత క్లోజ్నెస్ ఎలా ఏర్పడింది అంటూ ఆరా తీస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే గతంలో ఒక ఎపిసోడ్లో బులెట్ భాస్కర్ చాలా చెత్తగా డాన్స్ చేశాడు. దానికి కుష్బూ పడి పడి నవ్వింది. అంతే కాదు దాని అనంతరం బుల్లెట్ భాస్కర్ తో మళ్లీ మళ్లీ ఆ డాన్స్ స్టెప్పులు వేయించి చూసింది. అలా వీరిద్దరి మధ్య ప్రతి ఎపిసోడ్లో డాన్స్ మూమెంట్స్ పెడుతూ వస్తున్నారు. దీంతో అయినా కనీసం ఈ షో రేటింగ్ దక్కుతుందేమో అన్న తరహాలో నిర్వాహకులు ఇలాంటి పనిచేస్తున్నారు అని భావిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: