SSMB 28 : విడుదలకి ముందే భారీ లాభాలు ?

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కూడా ఒకటి.ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 28వ సినిమాగా వస్తుంది. ఇక ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు.ఇక ఇప్పటికే చాలా స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో బాగా వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన మార్క్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా రూపొందిస్తుండగా, ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా మాస్, క్లాస్ ఇంకా ఫ్యామిలీ వంటి అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఖచ్చితంగా మెస్మరైజ్ చేయనుంది. 


ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే కళ్లు చెదిరే బిజినెస్ చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో సమాచారం వినిపిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ, ఓవర్సీస్ రైట్స్‌కు భారీ ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది. టోటల్ బిజినెస్ దాదాపు 150 కోట్ల దాకా జరిగినట్టు సమాచారం తెలుస్తుంది. అయితే ఎలాంటి ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ లేకుండానే ఈ సినిమాకు ఇలాంటి భారీ బిజినెస్ జరుగుతున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.మరి సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న ఈ సినిమాలో ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఏ విధంగా ఉంటాయా.. ఈ సినిమాతో మహేష్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసి ఘన విజయాన్ని అందుకుంటాడా అనేది చూడాల్సి ఉంది. ఈ సినిమాలో హాట్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోండగా, శ్రీ లీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: