అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ ని ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది అని చెప్పాలి. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఏకంగా అల్లు అర్జున్ స్టైల్ కి ఫిదా అయిపోయారు. ఈ సినిమాలోని పాటలు అల్లు అర్జున్ చేసిన డ్యాన్సులు కూడా ఎన్నో రోజులపాటు అటు ప్రేక్షకులు అందరిని కూడా ఉర్రూతలూగించాయి.


 ముఖ్యంగా పుష్ప సినిమాలో అటు రష్మిక మందన్న చేసిన సామీ సామి స్టెప్.. ఇక చూపే బంగారమాయనే అంటూ అల్లు అర్జున్ చేసిన మరో స్టెప్ అయితే అందరి దృష్టిని ఆకర్షించింది అని చెప్పాలి. ఇక ప్రతి ఒక్కరిని కూడా కాలు కదిపేలా చేసింది. దీంతో ఇక రష్మిక మందన ఎక్కడికి వెళ్లినా కూడా సామీ సామి పాటలోని స్టెప్ వేయాలి అంటూ అభిమానులు డిమాండ్ చేయడం చూశాము. ఇక రష్మిక అభిమానుల కోరికను కాదనలేక ఇప్పటివరకు ఎన్నో వేదికలపై ఈ స్టెప్ చేసి అలరించింది అని చెప్పాలి. అయితే ఇటీవల సామీ సామి పాట స్టెప్స్ మాత్రం ఇంకోసారి వేయను అంటూ రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. ఇక ఎలాంటి వేదిక మీదికి వెళ్లిన అభిమానుల కోసం ఇలాంటి స్టెప్ వేస్తూ వచ్చింది రష్మిక మందన్న. ఇకపోతే ఇటీవలే ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది. మీతో సామీ సామి పాటకు డాన్స్ చేయాలనుకుంటున్న అంటూ సోషల్ మీడియాలో ఒక నెటిజన్ రష్మిక మందనను అడిగాడు. దీనిపై రష్మిక స్పందిస్తూ ఇది ఇలాగే కొనసాగితే నడుములో సమస్యలు వస్తాయేమో.. ఇక నుండి ఆ స్టెప్ వేయను. మనిద్దరం కలిసినప్పుడు ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అంటూ రష్మిక రిప్లై ఇచ్చింది. ఇక ఇది తెలిసిన అభిమానులు మీరు సామీ సామీ స్టెప్ వేయకపోతే ఎలా.. అది మా అందరికీ ఫేవరెట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: