టాలీవుడ్ కమెడియన్ల లో ఒకరైన పృథ్వీ  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాను జనసేన పార్టీలో ఉన్నానని ఇతర పార్టీల దరిద్రాలను చూడటం అయిందని ఆయన తెలిపారు

ప్రతి ఒక్కరూ ఆ పార్టీ లో ఉన్నవాళ్లు కామెంట్లు చేసేవాళ్లు అని  కూడా పృథ్వీ అన్నారు. వైసీపీ వాళ్లు కొంతమంది అసహ్యమైన పనులు చేసినా వాళ్లను ఎవరూ కూడా ఏమీ అనలేదని ఆయన తెలిపారు.

తిరుపతిలో ఎవరో మన ఊరు మన బిర్యానీ పథకం అమలు చేశారని అందు లో ఉన్నది అంతా కూడా రెడ్లేనని పృథ్వీ చెప్పుకొచ్చారు. 175 సీట్లు వస్తాయని వైసీపీ ఊహిస్తోంది.60 సీట్లు వస్తే ఏం చేస్తుందని కూడా ఆయన కామెంట్లు చేశారు. అన్నిసార్లు ఒకే విధంగా జరగదని ఒక చక్రం ప్రకారం జరుగుతుందని పృథ్వీ చెప్పుకొచ్చారు.. ఒక్క ఛాన్స్ అడిగితే ఇచ్చారని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రజలకు వైసీపీ పై అభిప్రాయం మార్చాయని ఆయన చెప్పుకొచ్చారు.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు అలాగే శాశ్వత మిత్రులు ఉండరని ఆయన తెలిపారు. ఎన్ని వేషాలు వేసినా వైసీపీ అధికారంలో కి రాదనే విధంగా పృథ్వీ చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ సినిమా గురించి పట్టించుకునేంత చీప్ కాదని పృథ్వీ తెలిపారు. ప్రజలు సినిమాల ను చూసి మారరని కూడా ఆయన పేర్కొన్నారు. సింపతీ నే జగన్ ను అధికారంలోకి తెచ్చిందని పృథ్వీ వెల్లడించారు.

ఏపీ ప్రజలు సున్నిత మనుషులు అని ఆయన అన్నారు. పవన్ లీగల్ గా పెళ్లిళ్లు చేసుకున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. జగన్ పెళ్లిళ్లపై చేసే కామెంట్లు పవన్ మాజీ భార్యలను బాధ పెడతాయని కూడా పృథ్వీ పేర్కొన్నారు. పవన్ నామ జపం తప్ప వైసీపీ కి ఇంకేం తెలీదని పృథ్వీరాజ్ వెల్లడించారు. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: