పోయిన సంవత్సరం కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయ్యి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమాలలో చార్లీ 777 సినిమా ఒకటి. ఈ మూవీ లో కన్నడ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ నటుల్లో ఒకరు అయినటువంటి రక్షత్ శెట్టి హీరో గా నటించగా ... కె కిరణ్ రాజి మూవీ కి దర్శకత్వం వహించాడు. నోబిన్ పాల్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు లో కూడా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించింది.  ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ మొత్తంలో కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క తెలుగు సాటిలైట్ హక్కులను జీ తెలుగు సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జూన్ 11 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు జీ తెలుగు చానల్లో ప్రసారం చేయనున్నట్లు  జీ సాటిలైట్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: